TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆశా కార్యకర్తల ఆందోళన

Published on: Fri Nov 13, 2015 10:57AM

 

తెలంగాణ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తు్న్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు బస్ డిపోలు, బస్టాండ్ల ఎదుట ధర్నా నిర్వహించారు. బస్సులు డిపోల నుంచి బయటకి రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌ కుషాయిగూడ బస్ డిపో ఎదుట కూడా ఆశా కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆశా కార్యకర్తల ఆందోళనల కారణంగా శుక్రవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది.