తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త

posted on: Feb 23, 2026 2:50PM

 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్య మకారులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను అమలు చేయలేదని ఆరోపిస్తూ ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హు లైన వారికి ఎనిమిది వారా ల్లోగా ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరా డిన ఉద్యమకారులకు సంక్షేమ చర్యలు తీసు కుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ వాటి అమలులో ఆలస్యం జరుగుతోందని ఉద్యమ జేఏసీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. ఉద్యమకారులకు పెన్షన్, నివాస స్థలాల కేటాయింపు వంటి అంశాల్లో ప్రభుత్వం స్పందించడం లేదని పిటిషన్‌లో పేర్కొ న్నారు.పిటిషనర్ల తరఫున హైకోర్టు న్యాయవాది జి. కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అమలు చేయడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని తెలిపారు. 

అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులకు ఇప్పటి వరకు ప్రయోజనాలు అందలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు పథకాల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని కోర్టుకు తెలియజేశారు. అర్హుల గుర్తింపు, దరఖాస్తుల పరిశీలన జరుగుతోందని వివరించారు.హైకోర్టు కీలక ఆదేశాలు ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 

అభయహస్తం పథకం కింద అప్లై చేసుకున్న అర్హులైన తెలంగాణ ఉద్యమకా రులకు ఎనిమిది వారాల గడువులోగా ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయా లని ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడమ్ ఫైటర్ విభాగం అధికారులను ఆదేశించారు.హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ఉద్యమకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎన్నాళ్లు గానో ఎదురుచూస్తున్న సమస్యకు న్యాయపరమైన పరిష్కారం దొరికిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను ఎంత వేగంగా అమలు చేస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...