కేసీఆర్ మనసంతా అల్లం పంటపైనే ఉందట
Published on: Tue Oct 6, 2015 1:03PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ లీడర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లేశారు, అన్నదాతల ఆత్మహత్యలు, రైతుల సమస్యలకు బదులు తన ఫాంహౌస్ లో అల్లం పంట ఎలా ఉందో సమీక్షిస్తూ కేసీఆర్ బిజీగా గడుపుతున్నారంటూ ఆరోపించారు, రైతులకు న్యాయం జరిగే వరకూ తాము పోరాడతామన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి... కేసీఆర్ మెడలు వంచుతామంటూ వ్యాఖ్యానించారు, 1600మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే... ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలక్షేపం చేశారని రావుల మండిపడ్డారు


