Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజకీయ అక్కసుతోనే తెలంగాణకు అన్యాయం : మంత్రి శ్రీధర్ బాబు
posted on: Aug 13, 2025 5:26PM

పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష చూపించి, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తుందంటూ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మండిపడ్డారు.
‘ప్రపంచ స్థాయి అధునాతన సిస్టమ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 10 ఎకరాల భూమి కేటాయించాం. అన్ని రకాల సబ్సిడీలకు ఆమోదం తెలిపాం. రికార్డు సమయంలో అన్ని అనుమతులిచ్చాం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలు పెట్టేందుకు సదరు ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నారు. అయినా... కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని విమర్శించారు.
* కనీస సంసిద్ధత లేని ఏపీకెలా కేటాయిస్తారు..?
అన్ని రకాలుగా అర్హతలున్నా తెలంగాణను విస్మరించి కనీస సంసిద్ధత లేని ఏపీకి ప్రాజెక్టును ఎలా కేటాయిస్తారని మంత్రి శ్రీధర్ బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘తర్కానికి అందని, న్యాయ విరుద్ధమైన ఈ నిర్ణయం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదముంది. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు దేశ పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాదు. అందుకే ఈ నిర్ణయాన్ని మరోసారి పున:పరిశీలించాల్సిన అవసరముంది. వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని తెలంగాణకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ డిమాండ్ చేశారు.
*కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. న్యాయం జరిగేలా చొరవ చూపాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికీ స్పందించకపోతే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.


.webp)
.webp)


