TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ వాదమే పనిచేసింది

Published on: Wed Mar 21, 2012 1:16PM

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మరోసారి తెలంగాణ వాదానికి పట్టం కట్టారని టిడిపి నేత కడయం శ్రీహరి అన్నారు. ఎన్నికల్లో తెలంగాణ వాదమే ప్రధానంగా పనిచేసిందన్న ఆయన ప్రజల తీర్పును శిరసావహిస్తాన్నారు. రాబోయో రోజుల్లో తెలంగాణకు కట్టుబడి ఉంటానని స్పష్టం కడియం చేశారు. తెలంగాణ కోసం ప్రజలు చేసే పోరాటంలో తాను భాగస్వామినవుతాన్న ఆయన తెలంగాణ వాదిగా పనిచేస్తానన్నారు. కాగా కడియంపై టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య ఆదినుంచి మెజార్టీతో కొనసాగారు.

కామారెడ్డిలో సాధించిన ఘన విజయం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వారికి అంకితం ఇస్తున్నట్లు టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్దన్‌ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన 44 వేల 465 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గోవర్థన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కేంద్రంలో కాంగ్రెస్‌, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. కాగా కామారెడ్డిలో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలబడి డిపాజిట్‌ దక్కించుకుంది. మూడోస్థానంలో నిలిచిన టీడీపీ డిపాజిట్‌ కోల్పోయింది.

మహబూబ్ నగర్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. జాతీయ పార్టీగా ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. తెలంగాణాను తీసుకువచ్చే బాధ్యతను తీసుకుంటాం. ప్రజలు ఏ విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో ఆ విశ్వాసాన్ని నిజం చేయడానికి ముందుకుపోతామని భారతీయ జనతా పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం ఉపఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మా పార్టీని విజయపథంలో నడిపిందని ఆయన అన్నారు. తెలంగాణాను సాధించడంలో ఈ విజయం మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నాం అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ దిశానిర్దేశానికి ఈ విజయం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.