బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్​లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జోవోను హైకోర్టు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం ను ఆశ్రయించాలని నిర్ణించింది. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 13)న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ సర్కార్ డిసైడైంది.  అభిషేక్ మను సింగ్వి తో పాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్ల పై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్ లతో  ప్రభుత్వ వాదనలు వినిపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.  

ఇక హైకోర్టు జీవో9పై స్టేవిధిస్తూ..  తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.   బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు స్టేకు సంబంధించిన ఆర్డర్ కాపీ శుక్రవారం (అక్టోబర్ 10) అర్ధరాత్రి దాటిన తరువాత అందుబాటులోకి వచ్చాయి.   ట్రిపుల్ టెస్టు పాటించకపోవడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది.  అలాగే రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా  కాలపరిమితి దాటిన స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు  ట్రిపుల్​ టెస్ట్​ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్​ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu