Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఓటమి భారంతో మల్లన్న అభిమాని ఆత్మహత్య*
posted on: Mar 21, 2021 1:01PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటారు తీన్మార్ మల్లన్న. గెలుపు అంచు వరకు వెళ్లారు. అయితే తీన్మార్ మల్లన్న ఓటమని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం, లంకలపల్లిలో ఓ యువకుడు ఆత్మహ*త్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం శ్రీశైలం అనే యువకుడు పురుగులమందు తాగాడు. కొన ఊపిరితో ఉన్నట్లు భావించిన కుటుంబ సభ్యులు నల్గొండకు తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.తీన్మార్ మల్లకు మద్దతుగా శ్రీశైలం ప్రచారం చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహ*త్యకు పాల్పడ్డాడని.. ఆ యువకుడి బంధువులు, స్నేహితులు చెబుతున్నారు.
యువకుడి ఆత్మహ*త్య ఘటనపై స్పందించిన తీర్మాన్ మల్లన్న. ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. తమ్ముడు శ్రీశైలం తనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నాడని, తన టీమ్‌లో ఒక సభ్యుడుగా పనిచేశాడన్నారు. ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని తిరిగిన సోదరుడు దూరం కావడం చాలా బాధగా ఉందన్నారు. గెలుపోటములు సహజమని, ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేశారు.
‘‘సోదరులారా రాబోయేది మన రాజ్యమే.. ఎవరూ ఆధైర్యపడకండి.. సూసైడ్ చేసుకోవాల్సింది మనంకాదు.. ప్రజలకు దూరంగా ఉన్న రాజకీయపార్టీలు సూసైడ్ చేసుకోవాలి.. నా మీద అభిమానం ఉన్న సోదరులు ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని’’కోరారు. శ్రీశైలం కుటుంబానికి అండగా ఉంటామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.






