TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీమ్ ఇండియా విండీస్ పై గెలిస్తే నేరుగా సెమీస్ కే!

Published on: Fri Feb 27, 2026 8:39AM

డిఫెండింగ్ ఛాంపియన్, టోర్నీ ఫేవరెట్‌గా   టీ-20 ప్రపంచకప్‌ 2026లో బరిలోకి దిగిన టీమిండియాకు సూపర్-8లో దక్షిణాఫ్రికా గట్టి షాకిచ్చింది. టీమిండియాను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

అయితే అదే దక్షిణాఫ్రికా గురువారం (ఫిబ్రవరి 26) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ను చిత్తు చేసి టీమిండియాకు ఊరటనిచ్చింది. ప్రస్తుతం గ్రూప్-1 పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగా, విండీస్, టీమ్ ఇండియా జట్లు రెండేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి.   గురువారం (ఫిబ్రవరి 26)  రాత్రి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  ఆదివారం (మార్చి 1) విండీస్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ ఖాయమౌతుంది.

ఒక వేళ ఏదైనా కారణం చేత అంటే వర్షం కారణంగా ఆదివారం విండీస్, టీమ్ ఇండియా మ్యాచ్ రద్దైతే అప్పుడు నెట్ రన్ నెట్ రన్‌రేట్‌ ను పరిగణనలోకి తీసుకుంటారు. తో పని లేకుండా టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే విండీస్ పై టీమ్ ఇండియా గెలిస్తే నెట్ రన్ రేట్ తో పని లేకుండా నేరుగా సెమీస్ కు చేరుతుంది. మరో వైపు గురువారం (ఫిబ్రవరి 26) భారత్‌ చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే టోర్నీ నుంచి వైదొలగింది.