Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలుసుకోండి..!
posted on: Feb 11, 2025 9:30AM
.webp)
ఇంట్లో అయినా, బయటకు వెళ్లినప్పుడు అయినా టిఫిన్, భోజనం చేశాక టీ లేదా కాఫీ తీసుకోవడం చాలా మంది అలవాటు. ఇలా భోజనం తరువాత కాఫీ, టీ లు తీసుకోవడం అనేది ఎంత వరకు ఆరోగ్యానికి మంచిది అనే సందేహం చాలా మందికి వచ్చినా దాని రుచి అడ్డు కట్ట వేస్తుంది. అయితే భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉన్నవారికి షాకింగ్ న్యూస్ చెబుతున్నారు ఆహార నిపుణులు, వైద్యులు. భోజనం తరువాత కాపీ, టీ లు తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..
ఈ కాలంలో చాలా మంది కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఆహారం తీసుకోవడంలో కానీ, తప్పడు ఆహారపు అలవాట్లు ఉన్నా కానీ ఇలాంటి సమస్యలు వస్తాయట.
భోజనం చేసిన తరువాత కాఫీ, టీ తాగితే..
భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయి. టీలో కెఫిన్, టానిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను గణనీయంగా తగ్గిస్తాయి. భోజనం తరువాత కాఫీ, టీ తాగితే కడుపు నొప్పి, కడుపులో గ్యాస్ సులభంగా వస్తాయి. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఆ తరువాత ఏమీ తినాలని కూడా అనిపించదు.
శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. శరీరమంతా అలసట కమ్మినట్టు అనిపిస్తుంది. టీలో ఉండే టానిన్ శరీరంలో ఐరన్ ను శరీరం గ్రహించకుండా చేస్తుంది. దీని కారణంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఆహారం తిన్న వెంటనే టీ తాగే వారి దంతాలు చాలా దెబ్బతింటాయి. టీలో ఆమ్లం ఉంటుందని, ఇది దంతక్షయానికి కారణమవుతుందని చెబుతారు. దీని కారణంగా పంటి నొప్పి, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల నిద్ర లేకపోవడమనే సమస్య ఎదురవుతుంది. రాత్రి భోజనం తర్వాత టీ తాగితే నిద్ర పట్టదు. చాలా మంది టీ తాగిన తర్వాత రాత్రి నిద్రపోలేకపోతున్నామని తరచుగా ఫిర్యాదు చేస్తారు. అటువంటి పరిస్థితిలో వెంటనే టీని వదులుకోవడం మంచిది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...


.webp)



