TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెప్పులు వేసుకుని స్వామి వారి ఫోటోలు పట్టుకుంటారా?

Published on: Fri Feb 20, 2026 1:32PM

 మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రుల ఆగ్రహం

వైసీపీ సభ్యుల ఆందోళనలతో ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం సభ ఆరంభం కాగానే  వైసీపీ రెండు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఈ తీర్మానాలిచ్చారు. ఆ తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వారు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో   పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు.

సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి ఫొటోలతో రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వేంకటేశ్వర స్వామి ఫొటోలతో నిరసన తెలపడంపై అభ్యంతరం తెలిపిన ఆయన.. దేవుడి ఫొటోలను పట్టుకుని నిరసనకు దిగడం అనైతికమన్నారు. సభలో దేవుడి చిత్రాలను అనుమతించవద్దని మంత్రి కోరారు. చెప్పులు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫొటోలను ఎలా పట్టుకుంటారని పలువురు మంత్రులు ప్రశ్నించారు. పోడియంను చుట్టుముట్టి వైసీపీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.