Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తమ పార్లమెంటేరియన్ గా రామ్మోహన్ నాయుడు
posted on: Mar 20, 2021 7:03PM
శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ కీలక నేత రామ్మోహన్ నాయుడుకు అరుదైన అవార్డు లభించింది. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ పార్లమెంటేరియన్-2021 అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు తమ విధి నిర్వహణ, ప్రసంగాలలో చూపించే ప్రతిభ, సమర్ధత, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ‘ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్’ ఈ అవార్డులను ప్రకటించింది. ఈ సంస్థ ఏటా అవార్డులను ప్రకటిస్తుంది. గతంలో పార్లమెంటులో మంచి పనితీరు కనబరిచిన ఎంపీలకు ఇచ్చే ‘సంసద్ రత్న’ అవార్డును రామ్మోహన్ నాయుడు దక్కించుకున్నారు. పిన్న వయసులో ఈ అవార్డు పొందిన పార్లమెంటు సభ్యునిగా ఆయన రికార్డు సృష్టించారు.
ప్రైమ్ పాయింట్ అవార్డు అందుకున్నందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.
దేశానికి, ఏపీకి మంచిపేరు తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు. శ్రీకాకుళం లోక్‌సభ నుంచి రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమారుడు. ఎర్రన్నాయుడు మృతి తర్వాత రామ్మోహన్ రాజకీయాల్లోకి వచ్చారు.






