టీడీపీ ఎమ్మెల్యే కారు బోల్తా.. తలకి గాయాలు
posted on Sep 12, 2015 12:38PM

తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కారు ప్రమాదానికి గురయ్యారు. ఎమ్మెల్యే బుచ్చి బాబు ఆయతో పాటు మాజీ ఎమ్మెల్యే చైతన్యరాజు కొంత మంది ఎమ్మెల్యేలు కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లగా అక్కడ బుచ్చిబాబు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బుచ్చిబాబు తీవ్రంగా గాయపడ్డారు.. ఆయన తలకు దెబ్బ తలగడంతో అక్కడి ఆస్పత్రికి తరలించగా ఆయన తలకు 12 కుట్లు పడ్డాయి. అయితే బుచ్చిబాబుకు ప్రమాదం జరిగినట్టు ఆయన ఇక్కడికి వచ్చేంత వరకూ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో ఆయనకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు వెంటనే ఆయనను పరామర్శించారు. ప్రస్తుతానికి బుచ్చిబాబు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.