మహానాడు రెండో రోజు కార్యక్రమాలేంటో తెలుసా?

posted on: May 28, 2025 10:03AM

కడప వేదికగా జరుగుతున్న తెలుగుదేశం మహానాడులో రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు తీర్మానం ప్రవేశ పెడతారు. ఆ తీర్మానాన్ని  సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప బలపరుస్తారు.  

అనంతరం తెలుగుజాతి విశ్వ ఖ్యాతి.. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు అన్న అంశంపై చర్చ జరుగుతుంది. అదే విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కూడా విస్తృత చర్చ జరుగుతుంది. ఇక సాయంత్రం మహానాడులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుంది. పార్టీ అధినేతగా నారా చంద్రబాబునాయుడి ఎన్నిక లాంఛనమే కానుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...