Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహానాడు గ్రాండ్ సక్సెస్.. ఇక కడప జిల్లా టీడీపీకి అడ్డా : సీఎం చంద్రబాబు
posted on: May 29, 2025 7:14PM
.webp)
కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతోందని.. కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కొనియాడారు.
ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఉమ్మడి కడపలో పదికి ఏడు స్థానాలు గెలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి కష్టపడితే 2029 ఎన్నికల్లో పదికి పదికి స్థానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. జూన్ 12 నాటికి 500 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. వాట్సప్‌లో హాయ్ అని పెడితే పనులు జరుగుతాయి. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. దేశానికి ఉగ్రవాదుల వల్ల చాలా నష్టం. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం. రాజకీయాల ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్స్ దోచేశారు.
డ్రగ్స్, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల జోలికి వస్తే అవే వారికి అంతిమ గడియలు. గత పాలనలో భూతానికి పరిశ్రమలు వెనకడుగు వేశామన్నారు. భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నామని హామీ ఇచ్చా. రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. రాయల సీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తాం. రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్ ఉంది. ఆరు నెలల్లో కడప హజ్‌హౌస్ పూర్తి చేస్తాం. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది. జూన్ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ప్రజలకు డబ్బులతో పాటు ఆరోగ్యం ఉంటేనే నిజమైన అభివృద్ధిని తెలిపారు.






