TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ తగలబెట్టుకున్నా రాదు

Published on: Thu Sep 3, 2015 10:50AM


 


టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి.. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేయబోయే దీక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని.. దానికోసం గుంటూరులో దీక్ష చేస్తానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ గుంటూరులో దీక్ష చేస్తానని చెప్పున్నారు కానీ అదంతా జిమ్మిక్కు మాత్రమే అని విమర్సించారు. దీక్షలు కాదు కదా జగన్ పెట్రోలు పోసుకొని తగలబెట్టుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీక్షలు చేసే కాలం పోయింది.. అవన్నీ గాంధీ కాలంలోనే చెల్లుబాటయ్యేవి అని ఎద్దేవ చేశారు. అంతేకాదు మా అంటే రెండు మూడు రోజులు దీక్ష చేస్తారేమో తరువాత పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఇదంతా తన ప్రచారం కోసం.. అంతేతప్ప ఆయన దీక్ష వల్ల ఏపీకి ఒరిగేది ఏం లేదని అన్నారు.