నటి కవిత కూతురు ప్రేమ పెళ్ళిలో ట్విస్ట్ లు

posted on: Mar 16, 2013 2:10PM

 

 

TDP kavita madhuri, madhuri marriage, madhuri wedding, madhuri love marriage

 

 

ప్రముఖ నటి, తెలుగుదేశం పార్టీ నేత కవిత కుమార్తె మాధురి తమ డ్రైవర్ రాజ్ కుమార్ ను పెద్దపల్లి వెంకటేశ్వరాలయంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సడన్ గా ట్విస్ట్ వచ్చి చేరింది. “మా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మేమే పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం" అని చెప్పిన మాధురి రోజు తిరగగానే తిరగబడింది.

 

అసలు రాజ్ కుమార్ నాకు 15 రోజులకిందట షాపింగ్ మాల్ లో పరిచయం అయ్యాడని, ఆ తర్వాత ఒకరోజు నాకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడని ఆ తరువాత ఏం జరిగింది నాకు తెలియదని మాధురి చెబుతున్నట్లు తెలుస్తోంది. తనకు స్పృహ వచ్చేసరికి ఇద్దరికి వివాహం అయిందని చెప్పాడని, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మాధురి చెబుతోంది. ఇక తల్లి కవిత తన కుమార్తెను పెళ్లి చేసుకున్న అతను మా డ్రైవర్ కానే కాదని, అతనిని నేను ఎప్పుడూ చూడలేదని అంటోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...