Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెద్దారెడ్డి ఇంటి మీద టీడీపీ జెండా!!
posted on: May 15, 2024 12:55PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరో స్వతంత్ర పోరాటాన్ని తలపిస్తున్నాయి. స్వతంత్ర పోరాటం జరిగిన సమయంలో బ్రిటీష్ వాళ్ళ భవంతుల మీద మన పతాకాన్ని ఎగరేయడానికి స్వతంత్ర సమరయోధులు ఎంత రిస్క్ అయినా చేసేవారు. అదే తరహాలో ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో దారుణాలకు పాల్పడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎదిరించి నిలబడుతున్నారు. ఈ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీలో నిలిచారు. తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా పెద్దారెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. పలువురు టీడీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారు. భారీ స్థాయిలో అల్లర్లు సృష్టించారు. టీడీపీ నాయకుడు మునిరెడ్డి ఇంటి మీదకి పెద్దారెడ్డి తన అనుచరులతో కలసి వెళ్ళి రాళ్ళ దాడి చేశారు. ఈ దాడిలో పో్లీసులకు కూడా తీవ్ర గాయాలు అయ్యేలా పరిస్థితి తయారయింది. ఈ నేపథంలో జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి ఇంటి మీదకి వెళ్ళారు. దాంతో భయపడిపోయిన పెద్దారెడ్డి ఇంటి నుంచి పరారయ్యారు. జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగరబోతోందనేదానికి దీన్ని సింబాలిక్‌గా చెప్పుకోవచ్చు.


.webp)



