టిడిపి దీక్ష: క్షీణించిన ఎమ్మెల్యేల ఆరోగ్యం

posted on: Mar 28, 2013 4:19PM

 

 

TDP dharna against power hike, TDP continues dharna against power tariff hike

 

 

విద్యుత్ సమస్యలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులలో జైపాల్ యాదవ్, అనసూయ, సత్యవతి, రాథోడ్, సీఎం రమేష్, శ్రీరాం రాజగోపాల్, దేవినేతి ఉమ, కె. శ్రీధర్, ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పేర్కొన్నారు. వారికి తక్షణం వైద్య సహాయం అందించాలని డాక్టర్లు పోలీసులకు సూచించారు. కాగా టీడీపీ నేతలు వైద్య సహాయానికి నిరాకరిస్తూ, తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.

 

మరోవైపు విద్యుత్ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే విద్యుత్ సమస్యలకు కారణమని వారు ఆరోపించారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, సకాలంలో కరెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...