అంబటి బూతు పురాణం.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం
posted on: Jan 31, 2026 1:26PM

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలతో మరో సారి పెను వివాదానికి తెర లేపారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఇటీవల సుప్రీం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ చార్జీ షీట్ లో లడ్డూ ప్రసాదం లో జంతువుల కొవ్వు కల్తీ జరగలేదని పేర్కొందంటూ వైసీపీ నేతలు చెబుతుంటే.. కెమికల్స్ తో పాటు జంతువుల కొవ్వు కూడా కలిసిందని సిట్ చార్జిషీట్ లో పేర్కొందని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మహాపాపం అంటూ జగన్ ఫొటోలతో వెలిసిన ఫ్లెక్సీల వివాదం మొదలైంది. దీంతో కూటమి నేతలు మహా అపచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. రాష్ట్రంలోని పలు ఆలయాలలో పాప ప్రక్షాళన అంటూ వైసీపీ పూజలు చేయడం ఆరంభించింది. అందులో భాగంగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు గుంటూరులోని గోరంట్లలో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగిస్తానని అంబటి రాంబాబు చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతు పురాణం విప్పారు. దీనిపై తెలుగుదేశం శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
అంబటి వ్యాఖ్యాలపై తెలుగుదేశం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, ఇతర నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాణిక్యాల రావు అంబటి రాంబాబును సంస్కార హీనుడిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించి క్షమించరాని తప్పు చేశారని విమర్శించారు. తక్షణమే అంబటి తన మాటలను వెనక్కు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



.webp)
.webp)





