పెండింగ్ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం

posted on: Mar 29, 2024 2:55PM

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను  ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది.  ఇప్పటి వరకూ గంటా పోటీ ఎక్కడ నుంచి అన్న సందిగ్ధతకు తెరదించేసింది. ఆయనను ఆయన కోరుకున్న భీమిలి నియోజకర్గం నుంచే బరిలోకి దింపింది. ఆయనకు ఇద్దామని భావించిన చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా కళా వెంకటరావును ప్రకటించింది.

 ఇక కదిరి స్థానంలో ఇప్పటికే  కందికుంట యశోద పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ ఆమెకు బదులుగా ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కు అవకాశం ఇచ్చింది.  ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చింది. విజయనగరం లోక్‌సభ స్థానానికి   కలిశెట్టి అప్పలనాయుడును అభ్యర్థిగా ప్రకటించింది.  అనంతపురం అర్బన్ స్థానాన్ని ఆశించిన  ప్రభాకర్ చౌదరికి నిరాశ మిగులుస్తూ అక్కడ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించింది. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. 

చీపురుపల్లి - కళా వెంకట్రావు,  భీమిలి - గంటా శ్రీనివాసరావు, పాడేరు (ఎస్టీ) - కిల్లు వెంకటరమేశ్ నాయుడు,  దర్శి - గొట్టిపాటి లక్ష్మి,  రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం,  ఆలూరు - వీరభద్ర గౌడ్,  గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్, అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్,  కదిరి - కందికుంట వెంకటప్రసాద్

ఇక  లోక్ సభ అభ్యర్థులుగా విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు,  ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ,  కడప నుంచి భూపేశ్ రెడ్డిలను ప్రకటించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...