కాంగ్రెస్ లో తెలుగుదేశం విలీనం ??...

posted on: Jun 4, 2018 3:40PM

 

తెలుగుదేశం పార్టీ .. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ..తెలుగువారి ఆత్మగౌరవం నుండి పుట్టిన పార్టీ.. ఒక్కమాటలో చెప్పాలంటే నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ..  తెలుగుదేశమంటే తెలుగువాడు తెలుగువాడంటే తెలుగుదేశం అనుకునేలా ప్రజల్లోకి వెళ్లిన పార్టీ.. ఆ నమ్మకంతోనే ప్రజలు తెలుగుదేశానికి అధికారం కట్టబెట్టారు.. అన్నగారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.. తర్వాత తెలుగుదేశం పగ్గాలు చంద్రబాబుకి వచ్చాయి.. బాబు కూడా పార్టీ ని నిలబెట్టాడు.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఏ మాత్రం క్రుంగిపోకుండా 2014 లో తిరిగి అధికారంలోకి వచ్చారు.. ఇంతలో మళ్ళీ కష్టాలొచ్చాయి.. మిత్రపక్షం బీజేపీ ప్రత్యేకహోదా ఇస్తానన్నా మాట తప్పింది.. చివరికి ప్రత్యేక ప్యాకేజీక్కూడా మొహం చాటేసింది.. దీంతో టీడీపీ కి బీజేపీ కి మధ్య దూరం పెరిగింది.. అదే సమయంలో కర్ణాటక సాక్షిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం రోజు చంద్రబాబు రాహుల్ గాంధీతో చనువుగా ఉండటంతో.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు అంటూ వార్తలు మొదలయ్యాయి.. ఇప్పుడు దీన్నే బీజేపీ, వైసీపీ లు అస్త్రంగా మలుచుకుంటున్నాయి .. తాజాగా వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం కూడా ఇదే విషయం పై బాబు మీద విమర్శలు చేసారు.. తెలుగుదేశాన్ని కాంగ్రెస్ లో ఎప్పుడు విలీనం చేస్తున్నావ్ బాబు అంటూ ఓ బాణం విసిరారు.. చూద్దాం భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేస్తుందో.. పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమంటూ కాంగ్రెస్ కి దూరంగా ఉంటుందో లేక సీతారాం అన్నట్టు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ తో జంట కడుతుందో..  అంతా ఆ వెంకన్నకే తెలియాలి...

google-ad-img
    Related Sigment News
    • Loading...