TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ లోనే తెదేపా మహానాడు

Published on: Sun May 3, 2015 10:00AM

 

తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించుకొనే మహానాడును ఈసారి కూడా హైదరాబాద్ లోని గండిపేట వద్దనే నిర్వహించుకోవాలని తెదేపా నేతలు నిర్ణయించుకొన్నారు. ఈనెల 27నుండి మూడు రోజుల పాటు మహానాడు సమావేశాలు నిర్వహించబడతాయి. ఈసారి మహానాడును ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించాలని కొందరు నేతలు ప్రతిపాదించినప్పటికీ, తెలంగాణాలో తెదేపా శ్రేణులకు నూతనోతేజం కల్పించి జి.హెచ్.యం.సి.ఎన్నికలకు సన్నధం చేసేందుకు మహానాడును హైదరాబాద్ లోనే నిర్వహించాలని చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్టీ పోలిట్-బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల తెదేపా సీనియర్ నేతలు అందరూ పాల్గొన్నారు.