విమాన ప్రమాద బాధితుల కోసం ట్రస్ట్
Published on: Sun Jun 29, 2025 4:43PM
.webp)
గత జూన్ 12 వ తేదీన, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు, రూ.500 కోట్లతో, ఎఐ 171 ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్, నిర్ణయించింది. టాటా బోర్డు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా,విమాన ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు, ద్వారా’ జీవిత పర్యంతం ఈ ట్రస్ట్ ద్వారా’ ఆర్థిక సహాయం, నష్ట పరిహాం, వైద్య సంరక్షణ అందించడంతో పాటుగా, కుటుంబాల పునర్నర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని,టాటా ట్రస్ట్ తెలిపింది.అలాగే, ట్రస్ట్ పారదర్శక నిర్వహణ కోసం,నిపుణుల సేవలను వినియోగించుకోవడం జరుగుతంది టాటా ట్రస్ట్ తెలిపింది.


