Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళ పొత్తులకు.. పురిటి నొప్పులు!
posted on: Jun 15, 2025 6:50PM

తమిళ నాడు, శాసన సభ ఎన్నికలకు ఇంకా సమయం వుంది. వచ్చే సంవత్సరం (2026) ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం,ఇప్పటికే భగ్గుమంటోంది. అధికార విపక్షాలు రెండూ, గెలుపే లక్ష్యంగా, ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.ఎత్తులు, పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్రంలో గట్టిగా కాలు మోపేందుకు, శత విధాల ప్రయత్నిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం,ఏపీలో సక్సెస్ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్’ ఫార్ములాను రీప్లే’ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు, ప్రధాన ప్రతిపక్షం డిఎంకేతో సహా, అధికార అన్నా డిఎంకే వ్యతిరేక పార్టీలను, ఏకం చేసేందుకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, స్వయంగా రంగంలోకి దిగారు.
ముందుగా, రెండు నెలల క్రితమే, అన్నా డిఎంకే, బీజేపీల మధ్య పొత్తు ముళ్ళు వేశారు. అలాగే, సినీ నటుడు విజయ్’ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) తోపాటుగా, పీఎంకే తదితర పార్టీలతో జట్టు కట్టేందుకు, పాత, కొత్త మిత్రులను ఎన్డీఎ కూటమిలోకి తెచ్చుకునేందుకు అమిత్ షా, ఢిల్లీ నుంచే పావులు కదుపుతున్నారు. అయితే, ఇతర పొత్తుల విషయం ఎలా ఉన్నా, అన్నా డిఎంకే, బీజేపీల మధ్య కుదిరిన పొత్తు విషయంలోనే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, అమిత్ షా పోరోహిత్యంలో ఉభయ పార్టీల నాయకులూ లాంచనంగా, తాంబూలాలు ఇచ్చి పుచ్చున్నా పొత్తు పీటలెక్కడం అనుమానమే అంటున్నారు. ముఖ్యంగా ముందు నుంచి,డిఎంకేతో పొత్తు వద్దని వాదిస్తున్న,రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, అన్నామలై, ఆయన్ని ఓ బూచిల చూస్తున్న డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడ పళని స్వామిల, మధ్య సంబంధాలు ఉప్పూ నిప్పుల భగ్గుమంటూనే ఉన్నాయి.
తాజాగా, ఎన్నికల అనంతరం ఎన్డీఎ కూటమి గెలిచినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని, అన్నా డిఎంకే సర్కారే కొలువు తీరుతుందని పళనిస్వామి చేసిన ప్రకటన, అందుకు బదులుగా అన్నామలై’ఇచ్చిన కౌంటర్’ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజానికి, పళనిస్వామి, పొత్తు కుదిరిన కొద్ది రోజులకే, కూటమి గెలిచినా సంకీర్ణ కుదరదనే సంచలన ప్రకటన చేశారు. కాగా,ఇప్పడు అన్నామలై’ ‘అవునవును..సంకీర్ణ ప్రభుత్వం కాదు,వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ, ఎదురు చురక వేశారు.అంతే కాకుండా, ఆయన మరో అడుగు ముందుకేసి, ఈ సారి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు.అలాగే, రాష్ట్రంలో 2026లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పలేనని, రానున్నది బీజేపీ పాలన మాత్రమేనని చెప్పగలనని అన్నామలై పేర్కొన్నారు. అదలా ఉంటే,ఇరు పార్టీలలో పొత్తు వద్దనే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అంటున్నారు.ఈ నేపధ్యంలో, బీజేపీ, అన్నాడిఎంకే పొత్తుకు పురిటి నొప్పులు తప్పవని అంటున్నారు.


.webp)



