TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమన్నా మూడు పడవల ప్రయాణం

Published on: Mon Jun 10, 2013 5:20PM

 

 

 

 

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళ్, హిందీ భాషల చిత్రాలతో బిజీ బిజీగా ఉంటుంది. కోలివుడ్ లో సరైన అవకాశం రాక టాలీవుడ్ కి వచ్చి టాప్ హీరోయిన్ గా మారిన తమన్నా, తరువాత కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు సంపాదించుకొని తమిళ్ ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచింది. ఇదిలా ఉంటే... తాజాగా హిమ్మత్వాలా చిత్రంతో బాలీవుడ్ కి వెళ్ళిన తమన్నాకి ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం కాకపోయినా కూడా తమన్నా అందానికి బానిసైన అక్కడి దర్శక నిర్మాతలు తమ్మన్నా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

 

ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో కలిసి హలో బ్రదర్ రీమేక్ లో, తమిళ్ లో అజిత్ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. హిమ్మత్వాలా చిత్రం తర్వాత ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి ఓ చిత్రంలో నటించనుంది. మరి ఈ మిల్క్ భామ మూడు భాషల సినీ ప్రయాణం ఇంకెన్నిరోజులు చేస్తుందో చూడాలి.