ఏపీ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తారు

posted on: Jan 7, 2019 11:45AM

 

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు పనులు చేయకుండానే ప్రచారంతో గడిపేస్తున్నారని విమర్శించారు. ఏపీలో పరిపాలన సక్రమంగా లేదని.. అధికార పార్టీ అభివృద్ధి పనులు చేయకుండా ప్రతిపక్షం తరహాలో దీక్షలు చేస్తోందని ఎద్దేవాచేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పక్కనపెట్టి.. చంద్రబాబు కాంగ్రెస్‌ వెంట పడుతున్నారని విమర్శించారు. తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారన్నారు. అలాగే ఏపీ రాజకీయాల్లో కూడా కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే నాలుగు నెలల్లో దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ఫ్రెంట్‌ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని తలసాని ఆశాభావం వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...