తాజ్‌మ‌హ‌ల్ కాదు.. తేజో మ‌హాల‌య‌!

పిల్ల‌కో, పిల్లాడికో ఇంట్లోవాళ్లు తాత‌తండ్రుల పేర్లో, ఇష్ట‌దేవుని పేరో పెట్టుకుంటూంటారు. కానీ బంధువులు, చుట్టుప‌క్క‌ల‌ వారంతా అబ్బే అదేం పేరు అనుకుంటూ.. వారికి తోచిన పేరు పెట్టి పిలుస్తూంటారు.. పెద్ద‌య్యాకా అదే ఖాయ‌మ‌వుతుంది. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతానిక‌యినా, వ‌స్తువుక‌యినా, పురాత‌న క‌ట్ట‌డాల‌క‌యినా, పువ్వుకైనా బీజేపీవారు వారికి తోచిన పేరు మార్చి దాన్ని ఖాయం చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నారు. వారికి అదో స‌ర‌దా అదో తుత్తి! దీన్ని మూర్జ్ఞ‌త్వం అంటు న్నారు యావ‌త్ విప‌క్షాల నాయ‌కులూ. కాదు అస‌లు వాటికి ఉండాల్సిన పేరు ఇదే.. ఇత‌రులు అలా పేరు పెట్టారు అని బీజేపీ వారి జ్ఞాన‌బోధ‌! 

షాజహాన్, ముంతాజ్‌ల ప్రేమ మందిరం. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలం. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది పర్యాటకులు తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ ప్రపంచ వింతను చూసి కొత్త అనుభూతిని పొందు తారు. ఇలాంటి తాజ్‌మహల్‌పై మళ్లీ రాజకీయ వివాదం రాజుకుంది. తాజ్ మహల్ పేరు త్వరలో మారబోతోందని యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాజ్ మహల్ స్థానంలో శివాలయం ఉండేదని, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం, త్వరలోనే తాజ్ మహల్ పేరును రామ్ మహల్‌గా మార్చనుందని ఆయన స్పష్టం చేశారు.

తాజ్మహల్  పేరును తేజో మహాలయగా మార్చాలని బీజేపీ కౌన్సిలర్ శోభారామ్ రాథోడ్  ప్రతిపాదించారు. దీనికి సంబంధించి న తీర్మానాన్ని ఆయన బుధవారం ఆగ్రా నగర పాలక సంస్థ  కు సమర్పిస్తారు. దీనిపై నగర పాలక సంస్థ సభ్యులు తదుపరి నిర్ణయం తీసుకుంటారు. తాజ్ మహల్‌లో కమలంతో కూడిన కలశం ఉన్నట్లు రుజువులు తన వద్ద ఉన్నాయని శోభారాం రాథోడ్ తన ప్రతిపాదనలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజ్ మహల్ గురించి అసలు నిజాలు తెలుసుకు నేందుకు దానిలో తాళాలు వేసి ఉన్న 22 గదులను తెరవాలని కొన్ని నెలల క్రితం అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖ లైంది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది. 

ఇదిలావుండగా, తాజ్ మహల్ వాస్తవానికి ఓ శివాలయమని, ఈ విషయాన్ని ప్రాచీన గ్రంథాలు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డులు చెప్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ, యోగి ఆది త్యనాథ్ ప్రభుత్వం తాజ్ మహల్ పేరును రామ్ మహల్‌గా మార్చుతుందని చెప్పారు. బీజేపీ అనుకున్న‌ది త‌డ‌వుగా ఎంత ప‌నయినా ఏదో విధంగా త‌మ‌కు అనుకూలం చేసుకోవ‌డం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. దేశంలో ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా, బీజీఏపీ నాయకుల‌కు ఇత‌ర‌త్రా ప్ర‌జ‌ల్ని ప్రాంతీయ‌విభేదాలు రెచ్చ‌గొడుతూ ఇబ్బంది పెట్టాల‌న్న‌దే ల‌క్ష్యంగా చేసుకున్న‌ ట్టుంద‌ని విశ్లేష‌కుల మాట‌. ప్ర‌జాసంక్షేమం, రాష్ట్రాలు కేంద్రం మ‌ధ్య స‌హ‌కార ప‌రిస్థితులు, విదేశీ స‌రిహ‌ద్దుల స‌మ‌స్య‌లు కేంద్రా నికి చిన్నివిగానే క‌న ప‌డుతున్నాయి. మోదీ ప్ర‌భుత్వానికి అర్జెంటుగా ప్రాచీన క‌ట్ట‌డాల పేర్లు, బిల్డింగ్‌ల‌పేర్లు, న‌దుల పేర్లూ మార్చేస్తే అంతా హిందూస్తాన్ అయిపోతేగాని సంతృప్తిగా ఉండ‌దు. అందుకే ప్ర‌తీ రాష్ట్రంలో వారి వీరాభిమా నులు, ప్ర‌చార‌ కుల‌తో ఇలాంటి అర్ధంలేని, ప‌నికి మాలిన కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి ఆనందిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌ కులు అంటు న్నారు. ప్ర‌తీ ఏడాది ఏదో ఒక మ‌త ప‌ర మైన వివాదం రేపి దాన్ని దేశంలో పెద్ద చ‌ర్చ‌గా మార్చి అస‌లు స‌మ‌స్య‌ల మీద‌, పాల‌న‌మీదా ఎవ‌రూ ఆరోప‌ణ‌లు చేయ‌కుండా దృష్టి మ‌ళ్లించ‌డం  ప్ర‌ధాని, హోంమంత్రి షా, రాష్ట్రాల బీజేపీ నేత‌లు ఎంతో అత్య‌ వ‌స‌రంగా భావించ‌డం దుర‌దృష్ట‌క‌రం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu