సుష్మా స్వరాజ్.. ఆన్సర్ కిరాక్

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియా ద్వారా సామాన్యులకు అందుబాటులో ఉంటారు.. ఎవరైనా ఏదైనా సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందిస్తారు.. ఆమె స్పందిస్తున్నారు కదా అని చెప్పి ఆమెని తిక్క ప్రశ్నలు, చిలిపి ప్రశ్నలు అడిగి టైం వేస్ట్ చేయకూడదు.. కానీ తాజాగా ఒక నెటిజన్ అదే చేసాడు.. సుష్మాని ఓ తిక్క ప్రశ్న అడిగాడు, దానికి ఆమె ఫన్నీగా బదులివ్వడం విశేషం.

 

 

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే 'బాలీకి వెళ్లటం సురక్షితమేనా?.. మేం ఆగస్టు 11 నుంచి 17 మధ్య పర్యటించాలని అనుకుంటున్నాం.. ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాల్ని జారీ చేసిందా?  దయచేసి మాకు సలహా ఇవ్వండి' అంటూ నెటిజన్ సుష్మాని అడిగాడు.. దీనికి బదులుగా సుష్మా  అక్కడి అగ్నిపర్వతాన్ని సంప్రదించి మీకు చెబుతానంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు.. ఆ మధ్యన కొద్ది రోజులు ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో అగుంగ్ అగ్నిపర్వతం యాక్టివ్ గా ఉంది.. దాంతో అగ్నిపర్వతం నుండి లావా బూడిద పెద్ద ఎత్తున వెలువడటంతో ఎయిర్ పోర్ట్ ను మూసేశారు.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి పెద్దగా లేకున్నా, అప్పుడప్పుడు భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి.. అందుకే సుష్మా అతని ప్రశ్నకు కౌంటర్ గా ఆ ఆన్సర్ ఇచ్చారు.. అయితే సోషల్ మీడియాలో, గూగుల్ లో సెర్చ్ చేస్తే సరిపోయే దానికి మంత్రిని అడుగుతావా అంటూ అతని ప్రశ్నకు విమర్శలు, సుష్మా టైమింగ్ కు ప్రశంసలు వస్తున్నాయి.