Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సంవాద్ బైఠక్ అను మేథోమథనం
posted on: Nov 10, 2012 11:42AM


కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఏపీకి పెద్దపీట వేశామనిపించుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఇక రాష్ట్రం విషయాన్ని పెద్దగా పట్టించుకునే సూచనలు కనిపించడం లేదు. సూరజ్ కుండ్ లో జరిగిన మేధోమథనంలో దీనికి సంబంధించి స్పష్టమైన సూచనలు కనిపించాయి. రాష్ట్రంలో రగులుతున్న తెలంగాణ అంశంగురించి ఈ మేధోమథన సదస్సులో నామమాత్రమైనా చర్చ జరగనే లేదు. అసలు అదో పెద్ద విషయంకూడా కాదన్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం ధోరణి కనపడింది.
సూరజ్ కుండ్ లో పార్టీ కాన్ సన్ ట్రేషన్ పూర్తిగా 2014 ఎన్నికలమీదే కనిపించింది. మిగిలిఉన్న సమయం చాలా కీలకమని, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలని సోనియా చెప్పారు. ఈ సదస్సులో యువనేత రాహుల్ కి కీలక బాధ్యతలు అప్పజెబుతారంటూ వినిపించిన వార్తల్లో మాత్రం వాస్తవం కనిపించలేదు.
ధరల పెరుగుదలని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సోనియా ఈ సదస్సులో గట్టిగా కోరారు. సబ్సిడీ సిలిండర్ల ధరని 6 నుంచి 12 కి పెంచాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. కేంద్ర క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర మంత్రులు, సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితులకు మాత్రమే ఆహ్వానం అందడంవల్ల ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లలేదు. పిసిసి చీఫ్ బొత్సకూడా ఇదే కారణంవల్ల దూరంగా ఉన్నారు. లండన్ పర్యటననుంచి వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈ సదస్సుకి హాజరుకాలేకపోయారు.


.jpg)


