Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ పద్మావతికి సుప్రీంలో షాక్!
posted on: Apr 1, 2025 4:37PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రి డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరుకావాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి ఈ నెల 7, 8 తేదీల్లో సీఐడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ విచారణకు హాజరు కాకున్నా, విచారణకు సహకరించకున్నా మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది. ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసులో తప్పుడు మెడికల్ రిపోర్టు ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఏపీ హైకోర్టు ఆమె ముందస్తు బెయిలు పిటిషన్ ను తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ, విచారణకు హాజరై సహకరించాలని సూచించింది. అయితే ఆమె విచారణకు హాజరుకావడం లేదని, ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను మంగళవారం (ఏప్రిల్ 1) విచారించిన సుప్రీంకోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే మధ్యంతర రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది.


.webp)



