మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంలో చుక్కెదురు

posted on: Feb 25, 2026 1:07PM

 మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.   జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మల్లారెడ్డి,  ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం  జీడిమెట్లలోని సర్వే నం. 82/1/ఈఈలో   0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు.

తన భూమికి వెళ్లే దారిని మూసేశారనీ, ఈ విషయంలో తహసీల్దార్ జారీ చేసిన లేఖను కూడా ఆయన తన పిటిషన్‌లో సవాల్ చేశారు.  దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి, 45 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును మల్లారెడ్డి తదితరులు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.   సర్వే ప్రక్రియపూర్తయినందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీం కోర్టు వారి పిటిషన్ తోసిపుచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...