Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై స్టే నిరాకరణ
posted on: Jan 25, 2019 10:52AM

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లోక్ సభ,రాజ్య సభలో సైతం ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు సుప్రీంను ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై స్టే విధించడానికి నిరాకరించింది.






