TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లడ్డూ కేసులో స్వతంత్ర ‘సిట్’!

Published on: Fri Oct 4, 2024 11:34AM

తిరుపతి లడ్డూ కేసులో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  ఈ స్వతంత్ర ‘సిట్’ ఇద్దరు సీబీఐ సభ్యులు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ సభ్యులు, ఒకరు FSSAI సభ్యుడు ఉంటారని కోర్టు తెలిపింది. ఈ ‘సిట్’ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. రాజకీయంగా లడ్డూ విషయంపై వ్యాఖ్యలు చేయొద్దు అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గవాయి సూచించారు.