టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

posted on: Jan 21, 2019 11:45AM

 

తెలంగాణ పంచాయతీరాజ్‌ ఆర్డినెన్స్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ముందు  పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా పంచాయతీ రిజర్వేషన్లను కుదిస్తూ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని‌ కోరారు. రిజర్వేషన్లు 50శాతం నిబంధనలను దాటలేదని కృష్ణయ్య తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిబంధనలను అనుగుణంగానే ఆర్డినెన్స్‌ ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. గతంలో ఈ ఆర్డినెన్స్‌పై కృష్ణయ్య హై కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...