ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫొటోలపై పిటిషన్.. డిస్మిస్ చేసిన సుప్రీం

posted on: Feb 11, 2026 9:22AM

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.  ఆ పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.  విజయవాడకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి  కొండలరావు ప్రభుత్వ కార్యాలయాలలో ఉప ముఖ్యమంత్రి ఫొటో ఎలా పెడతారనీ, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగ హోదా లేదనీ పేర్కొంటూ సుప్రీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా  అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలలో పవన్ కళ్యాణ్ ఫోటోను ప్రదర్శించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ,  ఇది ప్రజా ధనం దుర్వినియోగం కిందకే వస్తుందని తన పిటిషన్ లో పేర్కొన్నారు.   ప్రజా ధనాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదంటూ గతంలో  సుప్రీంకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది.  ఉప ముఖ్యమంత్రి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించడం వల్ల మీకు వచ్చిన సమస్య ఏమిటని పిటిషనర్ ను ప్రశ్నించింది.  ఈ విషయంలో ఎటువంటి  సమస్య లేదని  పేర్కొంటూ సుప్రీం కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

గతంలో ఇదే పిటిషనర్ ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా,   డిప్యూటీ సీఎం ఫోటో  ప్రదర్శించడంపై నిషేధం   ఉందా ప్రశ్నిస్తూ, ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ గా పేర్కొంటూ అప్పట్లో ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో  పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఈ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...