సూపర్ స్టార్ అభిమానులకు శుభవార్త
posted on: Nov 14, 2013 10:13AM

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఒక శుభవార్త. త్వరలోనే రజనీకాంత్, మరియు అతని అల్లుడు ధనుష్ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి "రాంఝాన" ఫేం ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించబోయే ఈ మల్టీస్టారర్ చిత్రం ద్వారా అభిమానులకు పెద్ద పండగ అవబోతుంది. ప్రస్తుతం సౌందర్య దర్శకత్వంలో రూపొందిన రజనీకాంత్ "కొచ్చడయన్" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. అదే విధంగా ధనుష్ కూడా దర్శకుడు కె.వి. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బిజీగా ఉన్నాడు.






