సీనియర్ న్యాయవాది సుంకరకు సతీ వియోగం!

posted on: Oct 8, 2024 12:55PM

రాజస్థాన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్నదుర్మరణం పాలయ్యారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. బెజవాడ్ బార్ కౌన్సిల్ కు చెందిన 78 మంది న్యాయవాదులు స్టడీ టూర్ నిమిత్తం రాజస్థాన్ వెళ్లారు. ఈ తెల్లవారు జామున జోధ్ పూర్ టోల్ గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్యోత్స మరణించారు.  జ్యోత్స్న కూడా న్యాయవాది. అమరావతి రైతులకు మద్దతుగా ఆమె గట్టిగా నిలబడ్డారు. మహిళా సాధికారత కోసం కృషి చేశారు. ఆమె మరణం పట్ల మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

అలాగే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ కూడా సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుంకర రాజేంద్రప్రసాద్‌కి సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన న్యాయవాదులు త్వరగా కోరుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...