Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి.. 52 మంది మృతి
posted on: Nov 24, 2014 10:41AM

ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్టికా ప్రావిన్స్‌లోని ఓ వాలీబాల్ మైదానంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది మరణించగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మైదానంలో వాలీబాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరగడంతో మృతుల సంఖ్య అధికంగా వుంది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని ఆఫ్ఘన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటన మీద ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ అష్రాఫ్ ఘని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి.






