Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి
posted on: Nov 11, 2025 3:17PM

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ లోని జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో మంగళవారం జరిగిన శక్తిమంతమైన పేలుడులో 12 మంది మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులలో అత్యధికులు న్యాయవాదులేనని తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.
ఇది అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నా, ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. ఈ దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు చేయబోయిన దాడిని భద్రతా దళాలు అడ్డుకుని, ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్ టీటీపీ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లో టీటీపీ కార్యకలాపాలు పెరిగాయి. టీటీపీ నాయకులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.



.webp)


