అల్వాల్ స్విమ్మింగ్ పూల్‌లో విద్యార్థిని మృతి

posted on: Feb 23, 2026 4:07PM

స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఓ యువతి మరణించిన   విషాద కరమైన     అల్వాల్‌లో చోటుచేసుకుంది. స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా నీటిలో మునిగి  ఓ యువ విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలానికి చెందిన బీయారామ్ చౌదరి కుమార్తె వైష్ణవి (18)  అల్వాల్‌లోని లయోలా కళాశాలలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు ఎన్‌సీసీ నేవీ వింగ్‌లో కూడా సభ్యురాలిగా కొనసాగుతోంది.

ఆమె సాయిబాబా నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో స్నేహి తులతో కలిసి నివాసం ఉంటుంది.ప్రతి రోజు మాదిరిగానే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఓల్డ్ అల్వాల్ సూర్యానగర్‌లోని వీవీ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ ప్రాక్టీస్‌కు వెళ్లేది. ఆదివారం కావడంతో కొంత ఆలస్యంగా సాయంత్రం 4.30 గంటలకు స్నేహి తులు గౌతమి, ప్రణీతతో కలిసి పూల్‌కు చేరుకుంది.  స్నేహితులు కలిసి  స్విమ్మింగ్ చేశారు. 

ప్రాక్టీస్ సమయం ముగిసిన తర్వాత మిగతా స్నేహి తులు బయటకు వచ్చారు. అయితే వైష్ణవి, ప్రియాంక మాత్రం పూల్‌లోనే ఉన్నారు. ఈ సమయంలో వైష్ణవి ఒక్కసారిగా కుప్ప కూలి నీటిలో మునిగిపో యింది. విషయం గమనిం చిన ప్రియాంక వెంటనే కోచ్‌కు మరియు ఇతరులకు సమాచారం అందించింది. పూల్ సిబ్బంది వచ్చి వైష్ణవిని బయటకు తీశారు.

అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇదే స్విమ్మింగ్ పూల్‌లో గతంలో కూడా నలుగురు మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకసారి పూల్‌ను సీజ్ కూడా చేసినట్లు చెబుతున్నారు. ఘటన అనంతరం పూల్ యజమాని పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పలు అను మానాలు వ్యక్తమవుతు న్నాయి. భద్రతా ప్రమా ణాలు పాటించారా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...