కడుపు నొప్పి


కడుపునొప్పి ఉన్నాదా కడుపు నొప్పి... చెప్పండి నోరు విప్పి..... శూలము గుచ్చినట్టు సడన్ గా నొప్పి కలగటం వలన... శరీరాన్ని చీల్చినట్టు బాధ కలగటం వలన.. ఈ వ్యాధికి శూలవ్యాధి అనిపేరు వచ్చింది.  పొట్ట  పై భాగంలో నాభి ప్రాంతంలో, హ్రుదయము, పార్శ్వము వీపు వెన్నెముక కింది భాగము, కంఠము, పొత్తి కడుపు ప్రాంతంలో ఎక్కడైనా నొప్పి రావచ్చు. ఆహారం తినేటప్పుడు లేదా జీర్ణమయ్యే టప్పుడు కూడా నొప్పి రావచ్చు.  ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.


ముందు జాగ్రత్తలు: 

పొట్లకాయలు, కాకరకాయలు, చక్రవర్తికూర, మునగకూర, ఉప్పు వెల్లుల్లి సంవత్సరము దాటిన పాతబియ్యం ఆముదము, గోమూత్రము, వేడినీరు, నిమ్మపండ్లరసము సేవించాలి. రాత్రుల యందు నిద్రమేల్కొనుట, చేదురసం గల పదార్ధములు శీతల పదార్ధములు, వ్యాయామము, సంభోగము మద్యపానము, పప్పుదినుసులు, కారము గల పదార్ధములు తీసుకోకూడదు. దు:ఖము,కోపము, ఆవలింత, నవ్వు ఆకలి అపాన వాయువు, తుమ్ము లాంటివి నిరోధించాలి.


మందుజాగ్రత్తలు:  

ఆవు సంచితంలో కరక్కాయను ఉడికించి ఎండించి చూర్ణించి దాంట్లో బెల్లం, లోహభస్మం కలిపి సేవిస్తే కడుపులో మంటతో కూడిన నొప్పి వెంటనే తగ్గుతుంది. మజ్జిగలో భాస్కరలవణము, అజామోదార్కము, శంఖవటి అను ఔషధాలు బాగా పనిచేస్తాయి. హింగుత్రిగుణ తైలం ఒకటి రెండు చంచాలు వేడి నీరు గానీ లేదా పాలతో సేవిస్తే కడుపుబ్బరం, నొప్పి తగ్గి సుఖవిరేచనం అవుతుంది. ఇంటికి చూసుకొనేది వీధి శూల... ఒంటికి చూసుకొనేది వ్యాధి శూల...