లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...
Published on: Mon Apr 24, 2017 4:56PM
.jpg)
స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 290.54 పాయింట్లు లాభపడి 29,655.84 వద్ద ముగిసింది. నిఫ్టీ కీలకమైన 9,200 స్థాయిని దాటి 98.55 పాయింట్ల లాభంతో 9,217.95 వద్ద స్థిరపడింది. ఏసీసీ, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, గెయిల్, అంబుజా సిమెంట్స్ తదితర షేర్లు లాభపడగా.. లుపిన్, సిప్లా, అరబిందో ఫార్మా, జీ ఎంటర్‌టైన్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.


