Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్టాప్‌లర్‌తో కుట్లు వేసిన డాక్టర్
posted on: Mar 16, 2015 5:30PM

ఏదైనా పెద్ద గాయమైతే డాక్టర్లు కుట్లు వేస్తారు. అయితే వరంగల్ జిల్లాలోని ఓ డాక్టర్ గాయానికి కుట్లు వేయకుండా స్టాప్‌లర్‌తో పిన్నులు వేసి పంపించాడు. దాంతో గాయం తిరగబెట్టింది. ఇలా స్టాప్‌లర్‌తో ‘కుట్లు’ వేసిన డాక్టర్ ఏ ఆర్.ఎం.పీ. డాక్టరో కాదు.. ఎంబీబీఎస్ వెలగబెట్టిన డాక్టరే. తొర్రూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ అనే మహిళ తన భర్త కూర్మయ్యతో కలసి ద్విచక్ర వాహనం మీద వెళ్తూ వుండగా ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె నుదుటి మీద గాయమైంది. ఈ భార్యాభర్తలు తొర్రూరులోని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. ఆయనగారు గాయాన్ని తీవ్రంగా పరీక్షించి, గాయానికి స్టాప్‌లర్‌తో పిన్నులు వేయడం మొదలుపెట్టాడు. అది చూసి అదిరిపోయిన ఆమె భర్త పిన్నులు వేస్తున్నారేంటని ప్రశ్నిస్తే, ఆ డాక్టర్ ‘‘డాక్టర్ నువ్వా నేనా?’’ అని సీరియస్‌గా ప్రశ్నించడంతో ఆమె భర్త మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత ఆ పిన్నుల ధాటికి గాయానికి సెప్టిక్ అయి బాధ పెరిగింది. దాంతో ఆమె వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్ళింది. అక్కడి డాక్టర్లు ఈ నిర్వాకం చూసి నోళ్ళు తెరిచారు. ఈ నిర్వాకం గురించి తెలుసుకున్న మీడియా స్టాప్‌లర్ డాక్టర్ దగ్గరకి వెళ్ళి ఇలా కుట్లేశారేంటి అని అడిగితే, ఇప్పటి వరకు చాలామందికి ఇలా పిన్నులు వేశాను.. ఎవరికీ ప్రాబ్లం రాలేదని చెప్పడంతో అందరూ బిత్తరపోయారు.






