స్టీల్ స్లాగ్ విధానంలో రోడ్ల అభివృద్ధిపై అనుబంధ సమాచారం

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యర్థాల నుండి సంపద అనే దృష్టితో వ్యవస్థాపక మార్పుల వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమల నుండి ఏర్పడే స్టీల్ స్లాగ్ అనే వ్యర్థ పదార్ధాన్ని రహదారుల నిర్మాణం మరియు మరమ్మతుల పనుల్లో వినియోగించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సూచనల ప్రకారం, పర్యావరణ హితంగా మరియు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉండే విధంగా “ఎకోఫిక్స్ ” అనే కొత్త మిశ్రమ పదార్ధాన్ని అభివృద్ధి చేశారు.

 

 1. ఎకోఫిక్స్ ప్రత్యేకతలు : స్టీల్ స్లాగ్ అనే ఉక్కు పరిశ్రమలోని వ్యర్థ పదార్ధాన్ని తారు‌తో మేళవించి తయారుచేసిన మిశ్రమమే ఎకోఫిక్స్. ఇది పారిశ్రామిక వ్యర్థాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే సరైన ఉదాహరణ.

2.    ఎప్పుడైనా – ఎక్కడైనా పాత్ హోల్ రిపేర్ : ఇది మెటీరియల్ కావడంతో, అవసరం వచ్చిన వెంటనే రోడ్డుపై గుంతల్ని పూడ్చేందుకు ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

3.    వేడి చేయాల్సిన అవసరం లేదు: సాధారణ తారు రిపేర్ వర్క్ మాదిరిగా దీనిని వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇది సెట్టింగ్ తక్కువ సమయంలో జరుగుతుంది. దీని వలన ఫ్యూయల్ ఖర్చు తగ్గి, కాలుష్యం కూడా ఉండదు.

4.    నీటి ఉనికిలో కూడా పని చేస్తుంది : వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచినప్పటికీ, ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.. ఇది వర్షాకాలంలో పనులు ఆగకుండా చేయగలిగే అత్యుత్తమ పరిష్కారం.

5.    ఎక్కువ మన్నిక, తక్కువ ఖర్చు : సిఆర్‌ఆర్‌ఐ శాస్త్రజ్ఞులు ఈ మిశ్రమాన్ని పరీక్షించి, ప్రస్తుతం వినియోగిస్తున్న అన్ని పదార్ధాలకంటే మన్నికగా, మరియు తక్కువ వ్యయంతో పని చేసే ఉత్తమమైన పదార్ధంగా గుర్తించారు.

6. పర్యావరణ పరిరక్షణ: పారిశ్రామిక వ్యర్థాల వినియోగం ద్వారా భూమి, నీరు, వాయు కాలుష్యాలను తగ్గించడం.

7. ఆర్థిక ప్రయోజనం: తక్కువ ఖర్చుతో అధిక పనితీరు కలిగిన ఈ మిశ్రమాన్ని వినియోగించి ప్రజాధనాన్ని ఆదా చేయడం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu