మెగా క్యాంప్ లో శ్రుతిహాసన్ జోరు
Published on: Sat Mar 16, 2013 10:25AM

గబ్బర్ సింగ్ హిట్ తో ఐరన్ లెగ్ ముద్ర చెరిపేసుకున్న శ్రుతి హాసన్ పెద్ద హీరోల సరసన వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ 'రేసు గుర్రం'లో హీరోయిన్ గా ఎంపికైంది. తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన గబ్బర్ సింగ్ తో మెగా క్యాంప్ లోకి అడుగుపెట్టిన శృతి.... ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు'లో ఎంపికైంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్- హరీష్ శంకర్ సినిమా, రవితేజతో “బలుపు”, బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. తాజా ఆఫర్ తో మెగా హీరోలు ముగ్గురితో ఈ స్లిమ్ బ్యూటీ ఆడిపాడినట్టే. ఇప్పటికే మాంచి ఊపుమీద ఉన్న అమ్మడి కేరీర్ ఇకపై 'రేసుగుర్రం'లా దూసుకుపోతుందేమో చూడాలి.


