లంకలో టెస్ట్ గెలిచిన కివీస్

Publish Date:Nov 30, 2012

 

 srilanka newzland, newzland srilanka, srilanka test, newzland test

 

శ్రీలంక ఫై న్యూజీలాండ్ జట్టు 14 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్ లో విజయం సాధించ గలిగింది. చివరి సారిగా 1998 లో కివీస్ లంక గడ్డ ఫై విజయం సాధించింది. దీనితో రెండు మ్యాచ్ ల సిరీస్ లో చెరో జట్టు విజయాన్ని సాధించి రెండు జట్లు ట్రోఫీ ని పంచుకున్నాయి. 363 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో శ్రీ లంక 195 పరుగులకే కుప్ప కూలి కివీస్ చేతిలో 167 పరుగుల ఘోర పరాజయాన్ని చవి చూసింది.ఈ మ్యాచ్ లో కివీస్ మొదటి ఇన్నింగ్స్ లో 412 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ ను  194/9 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీ లంక తొలి ఇన్నింగ్స్ ను 244 పరుగుల వద్ద ముగించగా, రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకు అల్ అవుట్ అయింది.  శ్రీ లంక రెండో ఇన్నింగ్స్ లో మాథ్యూస్ 84 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలన బాట్స్ మన్ ఎవరూ 30 పరుగుల స్కోరును కూడా చేయలేక పోయారు. రాస టేలర్ కు ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా, హెరాత్ కు ‘ ప్లేయర్ అఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.