TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోంపేటపై ఆశలు వదులుకోని నాగార్జున కన్ ష్ట్రక్షన్స్

Published on: Mon Apr 2, 2012 10:24AM

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ప్రాణాలు బలైనా సోంపేటలో ఏదో ఒకనాడు ధర్మన్ విద్యుత్ కేంద్రం నిర్మించాలనే పట్టుదలతో నాగార్జున కన్ ష్ట్రక్షన్స్ కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంజిల్లా గొల్లగండి, సోంపేట మధ్య ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2008 ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 9.72 ఎకరాలను కారు చౌకగా నాగార్జున కన్ ష్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించింది. దేనీ వ్యతిరేకంగా రైతులు చారిత్రాత్మక పోరాటం జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు రైతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది రైతులు గాయపడ్డారు.

 

ఇంత జరిగినా ప్రభుత్వం నాగార్జున కన్ ష్ట్రాక్షన్స్ కి ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోలేదు. నాగార్జున కన్ ష్ట్రక్షన్స్ కూడా తన ప్రయత్నాలను మానుకోలేదు. ఇక్కడ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పితే తమప్రాంతం శ్మాశానంగా మారుతుందని స్థానికులు అంటున్నారు. అంతేకాక 32 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొబ్బరి తోటలకు కూడా ఈ థర్మల్ ప్లాంట్ వల్ల ముప్పు ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రాంతంలో గడ్డికూడా మొలవదంటూ రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. కానీ ఇక్కడ 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మూడు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అరుదైన 118 రకాల పక్షులు ఇక్కడ నివసిస్తున్నాయి. 36 గ్రామాల ప్రజలు ఇక్కడ దొరికే మత్య్ససంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతమందికి ఉపాధినిస్తున్న ఈ ప్రాంతంలో గడ్డి కూడా మొలవదని రెవెన్యూ యంత్రాంగం నివేదిక ఇవ్వడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాగ్ కూడా ఈ భూ కేటాయింపులను తప్పుపట్టింది. కేటాయింపులను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫారస్సులను ప్రభుత్వంగాని, నాగార్జున కన్ ష్ట్రక్షన్ కాని పట్టించుకునే సూచనలు కనిపించడం లేదు.