TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉత్తరాంధ్రకు... ప్రత్యేక ప్యాకేజీ ఉత్తిదేనా?

Published on: Thu Sep 8, 2016 12:48PM

జైట్లీ ప్రత్యేక ప్రకటన ఉట్టిదే అంటున్నారు ప్రతిపక్ష నేతలు. కాదు, గట్టిదేనని గట్టిగా వాదిస్తున్నారు అదికార పక్షం వారు. అయితే, హోదా రాలేదన్న అసంతృప్తి ఆంధ్రులకు వుండటం సహజమే కాని జైట్లీ మాటలు మరీ ఉత్తివేం కావు. కనీసం ఉత్తరాంధ్రకైతే కొంత ఆశాజనకంగానే వుంది పరిస్థితి కేంద్ర ఆర్దిక మంత్రి ప్రకటనలో విశాఖపట్నానికి సంబంధించిన కీలకమైన అంశం చెన్నై - విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్. దీని వల్ల విశాఖపట్నానికి పారిశ్రామికంగా మంచి ప్రొత్సాహం లబిస్తుంది. అంతే కాదు, అందుకు అయ్యే ఖర్చంతా కూడా కేంద్రమే భరిస్తుందని జైట్లీ చెప్పారు.

విశాఖ పట్నం విషయంలో ఎప్పట్నుంచో వినిపిస్తున్న డిమాండ్ ప్రత్యేక రైల్వే జోన్. దీని గురించి కూడా జైట్లీ ప్రస్తావించారు. అయితే, విశాఖ ప్రత్యేక జోన్ విషయం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చూసుకుంటారని ఆయన అన్నారు విశాఖపై ఎంతో ప్రభావం చూపే పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఆర్దిక మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. పోలవరం కట్టేందుకు అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని ఆయన తేల్చేశారు! ఇక వెనుకబడిన ప్రాంతాలకి ఇచ్చే ఆర్దిక సాయం కూడా తప్పకుండా కొనసాగుతుందని జైట్లీ అన్నారు. అంటే, విశాఖపట్టణం కూడా ఈ వెనుకబడిన జిల్లాల్లో భాగంగా ప్రతీ యేటా కేంద్ర నిధులు పొందుతుందన్నమాట!

కేంద్ర ప్రకటనలో జనం ఆశించినంత క్లారిటీ లేకున్నా ఉత్తరాంధ్రకు మాత్రం కొంత మేలు జరిగే సూచనలే కనిపిస్తున్నాయి. కాకపోతే, ఢిల్లీ మాటల్ని ప్రజలు ఎంత వరకూ నమ్ముతారన్నదే ఇప్పుడు ప్రశ్న!