సైబర్ నేరగాళ్ల కట్టడికి పోలీసుల ప్రత్యేక ఆపరేషన్
Published on: Fri Jan 10, 2025 9:52AM
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు చెల రేగిపోతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశ వ్యాప్తంగా 328 కేసులు నమోదయ్యాయి. ఒక్క తెలంగాణలో 30 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. హైదరాబాద్ పోలీసులు ఎపి, కర్నాటక, యుపి, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహించి 23 మందిని సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, చెక్ బుక్ లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


