Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్పీకర్ పదకొండు సెటైర్ వెనుక ఇంతుందా?
posted on: Feb 12, 2026 12:29PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డికి 2024 ఎన్నికల తరువాత నుంచీ లెవన్ రెడ్డి అనే పేరు కూడా వచ్చి చేరింది. వైసీపీ కార్యకర్తలు పార్టీ ర్యాలీల్లోనే ఈ పేరుతో నినాదాలు కూడా చేస్తుంటారు. ఇందుకు కారణం 2024 ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని వైసీపీ సాధించిన సీట్ల సంఖ్య 11 కావడమే. కొందరైతే ఆయనను లెవనాసుర అని కూడా అంటుంటారు.
అది పక్కన పెడితే తాజాగా జగన్ అసెంబ్లీకి ఇలా హాజరై, అలా వాకౌట్ చేసినప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు 11-11-11 అంటూ కామెంట్ చేశారు. పదకొండు మంది ఎమ్మెల్యేలతో వచ్చిన జగన్ 11 నిమిషాల 11 సెకన్లు మాత్రమే ఉండి వెళ్లడంతోనే స్పీకర్ ఈ కామెంట్ చేశారని అంటారు. ఆ మధ్య ఒక సినిమా వేదికపై నటుడు పృధ్వీ పదకొండు గొర్రెలు అంటూ చేసిన కామెంట్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో.. ఆ కామెంట్ చేసిన పృధ్విని జగన్ సైన్యం, అంటే వైసీపీ శ్రేణులు ఎంతలా వేటాడి, వెంటాడి వేధించాయో కూడా తెలిసిందే. ఇందుకు కారణం మరేమీ కాదు.. 11 అన్న సంఖ్య అంటే జగన్ కు, ఆయన సామాజిక మాధ్యమ సైన్యానికీ కూడా అస్సలు గిట్టదు. ఈ సంఖ్య నినడానికీ, కనడానికీ కూడా వారికి భయం, బెదురు. దీంతో ఎక్కడ 11 నంబర్ కనిపించినా, అది జగన్ ను ఉద్దేశించినదే అని వాళ్లకు వాళ్లు నిర్ణయించేసుకుని ఉడుక్కుంటుంటారు. అంతెందుకు ఆయన జైల్లో ఉన్న కాలాన్ని కూడా పదకొండుకు ముడిపెట్టి నెటిజనులు సెటైర్లు వేస్తున్న పరిస్థితి. అలాగే ఆయన చట్టపరంగా ఎదుర్కొంటున్న కేసులలోనూ 11 నంబర్ మేజిక్ చేస్తూన్నదంటారు. సీబీఐ ఆయనపై వేసిన ఛార్జి షీట్ల సంఖ్య 11. ఇక ఆ కేసుల్లో ఆయన ఏవన్ నిందితుడు.
ఏ అంటే న్యూమరాలజీ ప్రకారం ఒకటి. వన్ అంటే ఒకటి. ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టి చూసినా పదకొండే వస్తుందని జగన్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతున్న సంగతీ విదితమే. ఇక జగన్ వరుసగా 11 శుక్రవారాలు.. కోర్టుకు హాజరవడం కూడా అప్పట్లో మీడియా బాగా హైలెట్ చేసింది. అయితే అది 11వ నెంబర్ గా కాకుండా శుక్రవారంగా ప్రచారంలోకి వచ్చింది. అది వేరే సంగతి. ఒకప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా 11 ఉండేది. ఇటీవల కొందరు రిజైన్ చేయడంతో ఆ సంఖ్యలో మార్పు వచ్చింది. అలాగే జగన్ ఢిల్లీ పర్యటనల్లోనూ, సీట్ల కేటాయింపుల్లోనూ, పదకొండవ నెంబర్ ఆయన్ను వదల కుండా వెంటాడిందని అంటారు. గతంలో జగన్ ఢిల్లీ వెళ్లినపుడు ఆయనకు కేటాయించిన నివాసం, లేదా ఆయన హోటల్ రూం నెంబర్ కూడా 11.
ఇక జగన్ లెవన్ పై మీమ్స్ గురించి చెప్పనక్కర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవన్ లాగా.. జగన్స్ బొ*గ్స్ లెవన్ అనే పేరు మీద కూడా కొందరు మీమ్స్ గుప్పించారు. ఇలా జగన్ ని పదకొండో నెంబర్ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో వెంటాడి వేధిస్తోందంటారు పరిశీలకులు.






